mt_logo

మా మధ్య సెక్షన్లు వద్దు.. హైదరాబాద్ లో తలెత్తుకుని జీవిస్తున్నాం..

మా మధ్య సెక్షన్లు వద్దు.. కలిసిమెలిసి హైదరాబాద్ లో తలెత్తుకుని జీవిస్తున్నాం.. మేము సీమాంధ్ర వారసులం కాదు.. హైదరాబాద్ వారసులం.. తెలంగాణ బిడ్డలుగా గర్వపడుతున్నాం.. గంట కూడా కరెంటు పోని రాష్ట్రంలో నివసిస్తున్నాం.. దేశంలోనే గొప్ప రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఆశిస్తున్నాం.. హైదరాబాద్ అభివృద్ధి మనందరిది.. ఇదీ హైదరాబాద్ లోని సీమాంధ్ర ప్రజల అభిప్రాయం. హైదరాబాద్ లో సెక్షన్-8 అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత చర్యలకు వ్యతిరేకంగా ఆదివారం చందానగర్ లో టీఆర్ఎస్ నాయకుడు బొబ్బ విజయారెడ్డి ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చి నగరంలో స్థిరపడిన వారు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది సీమాంధ్రులు మాట్లాడుతూ దశాబ్దాలుగా హైదరాబాద్ లో ప్రశాంత జీవనం సాగిస్తున్నామని, కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినా ఏనాడూ ఇతర రాష్ట్రాల వారిని కించపరచలేదని గుర్తు చేశారు.

రాష్ట్ర విభజన జరిగాక ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా ఎవరిపనులు వారు చేసుకుంటూ ఉన్నారని, ఇక్కడ నివసిస్తున్నందుకు గర్వపడుతున్నామని అన్నారు. కుల, మత, పేద, ధనిక, ప్రాంతీయ, వర్ణ, వర్గ భేదాలు లేకుండా స్వేచ్చగా జీవించగల ప్రాతం ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఎంతో గౌరవంగా, సంతోషంగా, స్వేచ్చాయుతంగా జీవిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఓటుకు నోటు కేసులో ఇరికి తనను తాను రక్షించుకోవడానికే తమ మధ్య విభేదాలు సృష్టిస్తున్నారని వారు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *