సహాయ కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదన్నారు. నా గ్రామం – నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని కోనాపూర్‌లో స్కూల్ భవనానికి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.