mt_logo

సమైక్యవాదులకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు!

రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ సీమాంధ్ర నాయకులు వేసిన దాదాపు 20  పిటిషన్లను ఈ రోజు విచారించిన సుప్రీంకోర్టు జూన్ 2న ఏర్పడే రెండు రాష్ట్రాల అపాయింటెడ్ డే పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.

కేంద్రప్రభుత్వ వాదన వినకుండా రాష్ట్ర విభజనపై ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఎంత చెప్పినా వినకుండా పిటిషన్లు వేసిన సమైక్యవాదుల తరపు పిటిషనర్లను, ఉండవల్లి అరుణ్ కుమార్ ను అత్యున్నత న్యాయస్థానం హెచ్చరిస్తూ కోర్టును చేపల మార్కెట్ గా మార్చొద్దని ఆదేశించింది.

విచారణ జరుగుతుండగా మధ్యలో అడ్డుకున్న మాజీ ఎంపీ ఉండవల్లిపై న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డట్లు సమాచారం. ఆగస్ట్ 20న జరిగే తదుపరి విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ దెబ్బతో జూన్ 2న ఏర్పడబోయే తెలంగాణను అడ్డుకోవాలని కుట్రలు పన్నుతున్న సమైక్యవాదులకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టులా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *