ఫొటో: వైకాపా నేత సత్యనారాయణను కిందపడేసి కొడుతున్న తెదేపా వర్గీయులు
—
పైకి ఎన్ని సమైక్య సుద్దులు చెప్పినా అసలు లక్ష్యం రాజకీయ లబ్దేనని సీమాంధ్రలో రోజురోజుకూ వివిధ వర్గాలు, పార్టీల మధ్య పెరుగుతున్న తన్నులాటలు సూచిస్తున్నాయి.
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఆందోళనలు చేస్తున్న తెదేపా, వైకాపా, కాంగ్రెస్ పార్టీల నేతలు అనేకచోట్ల బాహాబాహీకి దిగుతున్నారు.
గత వారం నిడదవోలులో వైకాపా నేత రాజీవ్ కృష్ణపై తెదేపా వర్గీయులు దాడిచేశారు.
నిన్న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో వైకాపా కన్వీనర్ సత్యనారాయణపై తెదేపా కర్యకర్తలు దాడిచేసి బాగా కొట్టిండ్రు. ఇరు పార్టీలు సమైక్యాంధ్ర కొరకు చేస్తున్న ర్యాలీలు ఎదురైనప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. తెలుగుదేశం నాయకుడు సినీనటుడు మురళీమోహన్ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది.
గత వారం విశాఖపట్నంలో కూడా కాంగ్రెస్, తెలుగుదేశం వర్గీయులు సమైక్యాంధ్ర దీక్ష శిబిరంలోనే రక్తాలు కారేలా కొట్టుకున్నారు.
నిన్న పవన్ కల్యాణ్ సినిమా విడుదల అడ్డుకోవడానికి ప్రయత్నించిన సమైక్యాంధ్ర ఆందోళనకారులకు, పవన్ అభిమానులకు మధ్య అనేక సీమాంధ్ర టౌన్లలో గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరిమీద ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు.
ఈ గొడవలు చూసి అసహ్యించుకుంటున్న సీమాంధ్రలోని సామాన్య పౌరులు ఇప్పటికే సమైక్య ఆందోళనలకు చాలావరకు దూరమయ్యారు.