తెలంగాణలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ సీఎం కే చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. 2010 వేతన సవరణ సిఫార్సులకు అనుగుణంగా ఎస్జీటీలకు రూ. 10,900, స్కూల్ అసిస్టెంట్ లకు రూ. 14,800 వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. పెంచిన వేతనాలతో రాష్ట్రవ్యాప్తంగా 18,092 మంది ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరనుంది. అయితే వేతనాల పెంపు వల్ల ప్రభుత్వం మీద రూ. 27.22 కోట్ల భారం పడనుంది.