mt_logo

అమరులైన వారి కృషిఫలితమే టీ బిల్లు-నాగం

తెలంగాణ కోసం 1200 పైగా తెలంగాణ విద్యార్థులు, యువకులు బలయ్యారని, వారి త్యాగఫలితమే టీ బిల్లు అని బీజేపీ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ సమైక్యవాదం ముసుగులో ఉన్మాదిలా మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం అమరులైన వారి గురించి పట్టించుకోని సీఎం సమైక్యవాదం వినిపించడం అర్ధంలేనిదన్నారు. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు కనీసం బలిదానాల గురించి మాట్లాడకపోవడం సిగ్గుపడేవిధంగా ఉందని, ఆంధ్రజాతి కాబట్టే తెలంగాణ వారిపై వివక్ష చూపుతున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఇంకా హక్కులు కావాలని సీమాంధ్రులు కోరితే ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. పెద్దమనుషుల ఒప్పందం అమల్లోకి తేవాలని అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డికి చెప్పినా పట్టించుకోలేదని, 1969 ఉద్యమంలో పాల్గొని డిసెంబర్ 3వ తేదీన అరెస్ట్ అయ్యానని నాగం చెప్పారు. 1969 ఉద్యమం నాటి ఎన్నో సంఘటనలను ఆయన సభకు వివరించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ ప్రజలకు అన్నీ కష్టాలేనన్నారు. అసెంబ్లీలో అస్సలు ప్రజాస్వామ్యం లేదని, సమైక్య రాష్ట్రంలో నీటివనరుల దోపిడీ ఏవిధంగా జరిగిందో పూర్తి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ రాష్ట్రం అలానే ఉంటే తెలంగాణ సస్యశ్యామలం అయ్యుండేదని బచావత్ ట్రిబ్యునల్ చెప్పిందని గుర్తు చేశారు. నీలం సంజీవరెడ్డి నీటిని రాకుండా చేసి మహబూబ్ నగర్ జిల్లాను నాశనం చేశారన్నారు. ప్రాణహిత- చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *