ఎన్ఆర్ఐ పట్టాదారులకు బదులుగా డిక్లరేషన్ ద్వారా వారి బంధువులు చెక్కులు తీసుకునేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలకనిర్ణయానికి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
రైతే రాజు అని వినడమేగానీ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు ఒక్క కేసీఆర్ తప్ప అని నాగేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 61 వేల రైతుల కుటుంబాలకు చెక్కులు అందనున్నాయని, కేసీఆర్ రైతు బంధు అని మరోసారి నిరూపించారన్నారు. అదేవిధంగా చనిపోయిన రైతుల చెక్కులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుని వారి కుటుంబ సబ్యులకు ఆసరాగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నాగేందర్ రెడ్డి కాసర్ల కోరారు.