mt_logo

హైదరాబాద్ పై ఆర్‌ఎస్‌ఎస్‌ మతవిద్వేషం… భాగ్యనగర్ అంటూ ట్వీట్.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

హైదరాబాద్ నగరంపై మరోసారి మతం పేరుతో విషం కక్కేందుకు సిద్ధమైంది ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ పేరు మార్పుపై ఆర్‌ఎస్‌ఎస్‌ చిచ్చు రాజేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో నగరంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడు రోజుల సమన్వయ్‌ బైఠక్‌ సమావేశాలను ఏర్పాటు చేసింది. కార్యక్రమం షెడ్యూల్‌ను ప్రకటిస్తూ చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ‘సామాజిక జీవితంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో వివిధ సంస్థల ముఖ్య కార్యకర్తల సమన్వయ్ బైఠక్ 2022 జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు తెలంగాణలోని భాగ్యనగర్‌లో జరగనుంది’ అంటూ ఆర్‌ఎస్‌ఎస్ ట్వీట్‌ చేసింది. ఇందులో హైదరాబాద్‌కు బదులుగా భాగ్యనగర్‌ అని పేర్కొనడంపై పెద్ద ఎత్తున విమర్శలు రేపుతోంది. గత అసెంబ్లీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్‌ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఫైజాబాద్‌ను అయోధ్యగా, అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా మార్చినట్లుగా హైదరాబాద్‌ పేరును కూడా భాగ్యనగర్‌గా మారుస్తామనగా.. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కాగా మరోసారి భాగ్యనగర్‌ పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ ట్వీట్ చేయడంతో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *