mt_logo

మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణం కోసం రూ. 48.58 లక్షలు మంజూరు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పైలాన్ నిర్మాణానికి రూ. 48.58 లక్షలు మంజూరు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ కే జోషి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హన్మకొండలోని నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ) కార్యాలయ ఆవరణలో మిషన్ కాకతీయ పైలాన్ ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నీటిపారుదల శాఖలో ప్రస్తుతం ఉన్న టెండర్ల ప్రక్రియకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్లు ఎంత మొత్తానికైనా జరిగే టెండర్లో పాల్గొనవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదిలాఉండగా మిషన్ కాకతీయకు తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తమ రెండురోజుల వేతనం (సుమారు రూ. 60 లక్షలు) విరాళంగా ఇస్తున్నట్లు తెలుపుతూ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి సోమవారం ఒక లేఖ అందించింది. బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జీ ఉపేందర్ రావు, గౌరవాధ్యక్షుడు పీ విజయరామారావు, కోశాధికారి టీ అశోక్ కుమార్ తదితరులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *