మాజీ మంత్రి హరీష్ రావును రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) బాధితులు, రైతులు ఈరోజు కలిశారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీని, ఎన్నికల తర్వాత మాట తప్పిన వైఖరిని హరీష్ రావుకు బాధితులు వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా తమ బాధను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా కాంగ్రెస్ మాట నిలుపుకునే వరకు బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఉత్తర దిక్కు ఆర్ఆర్ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారి చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యం. కాంగ్రెస్ పార్టీ తీరు ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న చందంగా ఉంది అని విమర్శించారు.
ఆర్ఆర్ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలోమీటర్లను పరిగణలోకి తీసుకొని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నదనీ, బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నారు అని పేర్కొన్నారు.
చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారు. దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారు. దక్షిణ భాగాన ఆర్ఆర్ఆర్ కోసం ఎలాగైతే 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఉత్తర బాగానే ఉన్న చౌటుప్పల్ వైపు 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీగా ఉన్నపుడు కోమటి రెడ్డి గారు.. బాధితులతో కలిసి ఆర్ఆర్ఆర్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం దుర్మార్గం అని దుయ్యబట్టారు.
ఇదెక్కడి న్యాయం.. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా? నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చారు. నాడు ఆర్ఆర్ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్పు, అన్నారు నేడు మాట మార్చారు మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్ధతా? అని ప్రశ్నించారు.
కోమటిరెడ్డి గారు మీకు మతిమరుపు ఎక్కువ అయినట్లు ఉంది. మీరు చెప్పిన హామీల వీడియోలు పంపిస్తున్నా.. చూసుకోండి. జిల్లా మంత్రిగా, శాఖ మంత్రిగా ఉన్నావు. నల్గొండ ప్రజలకు న్యాయం చేస్తావా? చరిత్ర హీనుడుగా మిగులుతావా? మీ మాటలు ప్రజలు నమ్మడం లేదని, ప్రియాంక గాంధీ గారి చేత హామీలు చెప్పించారు. యధావిధిగా మాట తప్పారు అని ధ్వజమెత్తారు.
భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీ గారితో.. ఆర్ఆర్ఆర్ భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారు. కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. వేధిస్తూ దాడులకు దిగుతున్నారు అని హరీష్ రావు మండిపడ్డారు.
మా మీద విమర్శలు చేయడం ఆపి ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీ అమలు చేయండి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు. బాధితులు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం అని అన్నారు.
ఎన్నికల ప్రచార సభల్లో మీరు ఇచ్చిన హామీలను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రియాంక గాంధీ గారు చొరవ తీసుకొని బాధితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆదేశించాలని కోరుతున్నాం ప్రియాంక గాంధీ గారు మీరైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదా కాంగ్రెస్ నైజమే ఇంత అని మాట తప్పుతారా? అని అడిగారు.
- Is Meinhardt replicating Pakistan’s failed model for the Musi Beautification Project?
- Why did Revanth select controversial Meinhardt company for the Musi Beautification Project?
- Revanth & Co’s frequent foreign trips: A drain on Telangana’s exchequer
- KTR accuses Congress govt. of implementing ‘bulldozer culture’ in Telangana
- Why did cost of Musi Beautification Project soar to Rs. 1.5 lakh cr?
- కొండా సురేఖపై పరువు నష్టం కేసు వేసిన కేటీఆర్
- భారత వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసిన రతన్ టాటా ఎందరికో ప్రేరణ: కేటీఆర్
- ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త రతన్ టాటా: కేసీఆర్
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- డబ్బు సంచులతో పట్టుబడ్డ రేవంత్ ఉపాధ్యాయులకు నీతి వచనాలు చెబుతున్నాడు: హరీష్ రావు
- యూపీలో లాగా తెలంగాణలో రేవంత్ బుల్డోజర్ సంస్కృతిని తీసుకొచ్చాడు: కేటీఆర్
- ఏడు గ్యారెంటీల కాంగ్రెస్ గారడీని హర్యానా ప్రజలు తిరస్కరించారు: కేటీఆర్
- 10 లక్షల మంది గురుకుల విద్యార్థులతో ప్రభుత్వం ఆడుకుంటోంది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ గ్యారెంటీల మోసం నుండి తప్పించుకున్న హర్యానా!
- సోషల్ మీడియాను చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డికి కేసీఆర్ కావాలా?: జగదీశ్ రెడ్డి