mt_logo

ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు! 

ప్రధాని నరేంద్ర మోడితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లవ్‌లో పడ్డారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అర్థమవుతోంది. నిన్న రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి ‘బడే భాయ్’ (పెద్దన్న) అని వ్యవహరించడం, అలాగే రాహుల్ గాంధీ నిరంతరం విమర్శించే గుజరాత్ మోడల్‌ను ఆకాశానికెత్తడం త్వరలోనే రేవంత్ కాంగ్రెస్ నుండి జంప్ చేస్తాడు అనే సంకేతాలు ఇస్తున్నాయి. 

నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా జరిగిన ప్రైవేటు ప్రోగ్రాముల వివరాలను కూడా రేవంత్ రెడ్డి తన పర్సనల్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ఈ విషయాన్ని మరింత ఖరారు చేస్తోంది. మరే కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా నరేంద్ర మొడీతో ఇంత సన్నిహితంగా వ్యవహరించిన దాఖలాలు లేవు.

రెండు రోజుల నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తించిన తీరు, వేదిక మీద భిరంగంగా మోడీ-రేవంత్ మధ్య జరిగిన ప్రేమ కల్లాపాలు కాంగ్రెస్ హై-కమాండ్ గుండెలో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే రేవంత్ కాంగ్రెస్ పుట్టు ముంచడం ఖాయం అని సీనియర్ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు పంపుతున్నారట.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయని, కనుక బీజేపీకి జంప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తోంది. ఆ ఆరోపణలను రేవంత్ ఏనాడూ ఖండించలేదు కూడా. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండీ కాంగ్రెస్ అధిష్టానం ఆయన మీద నిశితమైన నిఘా పెట్టింది అనే వార్తలు కూడా గుప్పుమన్నాయి.

రేవంత్ర్ ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ పోయినప్పుడు, ఆ తరువాత రెండు సార్లు బీజేపీ మంత్రులను, కేంద్ర నాయకులను కలవడానికి పోయినప్పుడు రేవంత్ వెంట భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి తదితర నాయకులను వెంటపంపింది కాంగ్రెస్ అధిష్టానం. సాధారణంగా మరే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెంటా ఇలా ఉప ముఖ్యమంత్రిని, మంత్రులను తోడుగా కాంగ్రెస్ అధిష్టానం పంపలేదు. 

నరేంద్ర మోడీకి సన్నిహితుడుగా పేరొందిన అదానీతో కూడా రేవంత్ రెడ్డి సన్నిహితంగా తిరుగుతున్నారు. గత నెలలో రాహుల్ గాంధీ అదానీని తిట్టిపోసిన రోజే అదానీతో ఒక వాణిజ్య ఒప్పందం మీద రేవంత్ రెడ్డి సంతకం చేసి కాంగ్రెస్ అధిష్టానం పరువుతీశారు.

గత రెండు రోజుల పరిణామాలతో ఖంగుతిన్న కాంగ్రెస్ అధిష్టానం త్వరలోనే రేవంత్ మీద చర్యలకు ఉపక్రమిస్తుంది అని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. లేని పక్షంలో పార్లమెంటు ఎన్నికల తరువాత రేవంత్ కాంగ్రెస్ పార్టీ పుట్టి ముంచడం ఖాయం అని వారు తెగేసి చెబుతున్నారు.