హరితహారం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆదిలాబాద్ పర్యటనలో ఉన్న అటవీశాఖామంత్రి జోగురామన్న అన్నారు. హరితహరంలో భాగంగా నాటే మొక్కల బాధ్యతను గ్రామ కమిటీలకు అప్పగించనున్నట్లు మంత్రి తెలిపారు. జూలై 3వ తేదీన హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నల్గొండ జిల్లా యాదాద్రిలో ప్రారంభిస్తారని, ప్రతి మొక్కకు సీరియల్ నంబర్ ఇచ్చి వాటి బాధ్యతను గ్రామ కమిటీలకు అప్పగిస్తామని, గ్రామ కమిటీలో సర్పంచ్ లు అధ్యక్షులుగా ఉంటారని జోగురామన్న చెప్పారు.