హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం మరో 28 స్థలాలను కేటాయించాలని పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ(రెడ్కో) చైర్మన్ వై సతీశ్‌రెడ్డి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈమేరకు సతీష్ రెడ్డి ప్రగతిభవన్‌లో కేటీఆర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీఎస్‌ఐఐసీ, ఐటీ సెక్టార్, టీహబ్, టీవర్క్స్ తదితర సంస్థలకు చెందిన 28 స్థలాలు ఇందుకు అనువుగా ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే నేషనల్ క్లీన్ ఎనర్జీ స్కీం కింద తాము ఈ స్థలాల్లో చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. తమ ప్రతిపాదనకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేటీఆర్ చెప్పినట్టు సతీష్ రెడ్డి పేర్కొన్నారు.
