తెలుగు జాతంతా ఒక్కటే, కలిసుందాం, విడిపోవద్దు అని గొంతులు చించుకుని అరుస్తున్న సీమాంధ్ర నేతలు పీవీ, నీలంల వేడుకలు చేయడంలో మాత్రం పక్షపాత ధోరణితో ఆలోచించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ రాష్ట్రపతి, తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతిని, ముఖ్యమంత్రిని, గవర్నర్ ను ఆహ్వానించి, తెలంగాణకు చెందిన మాజీ ముఖ్యమంత్రి, ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మాత్రం విస్మరించింది. వైజాగ్ లోని గవర్నర్ భవనం సమీపంలో పీవీ విగ్రహానికి కనీసం దండ కూడా వెయ్యలేదు. మీడియాలో వార్తలు చూసి సాయంత్రానికి ఎవరో ఒక దండ వేసి చేతులు దులుపుకున్నారు.
పీవీ నరసింహారావు తొమ్మిదో వర్ధంతి వేడుకలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద జరిగాయి. నిజానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ వేడుకలకు హాజరవ్వాల్సి ఉంది. కానీ ఆయన రాకపోవడంతో చాలాసేపు ఎదురుచూసి రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావు మొదట పీవీ సమాధికి పూలతో నివాళులర్పించారు. ఇప్పటికైనా అర్ధమయిందా సీమాంధ్ర నేతలకు తెలంగాణ వారిపై ఎంత చిన్న చూపో!