mt_logo

మరో వారం రోజులు గడువు పెంచిన రాష్ట్రపతి

తెలంగాణ బిల్లుపై చర్చకు గడువు జనవరి 30 వరకూ రాష్ట్రపతి అనుమతి ఇచ్చినట్లు సమాచారం రావడంతో ఈనెల 23కల్లా ముగుస్తుందనుకున్న చర్చ ఈ నెలాఖరు వరకూ ఉంటుంది. వీలైనంత త్వరగా చర్చ ముగించి కేంద్రానికి బిల్లు సమర్పించాలని రాష్ట్రపతి సూచించారు. ఫిబ్రవరి 20 వరకూ గడువు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం కోరిన గడువును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రపతి గడువును పొడిగించారు. రాష్ట్రపతి నుండి వచ్చిన లేఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి గురువారం అందింది. ఎట్టిపరిస్థితుల్లో 30 కల్లా తిరిగి బిల్లును కేంద్రానికి పంపించాలని ప్రభుత్వవర్గాలు తెలియజేసాయి. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో సభకు చదివి వినిపించారు. ఫిబ్రవరి 5 నుండి 21 వరకు జరగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తెలంగాణ వాదులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *