mt_logo

సీఎం కిరణ్ ది మైండ్ గేమ్ – కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ జిల్లా నగర శివారులోని బీఎల్ఎన్ గార్డెన్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్థి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పాటు అడ్డుకోవడానికి ఆడుతున్న మైండ్ గేమ్ పనిచేయదని, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల గడువు పెంచినా రాష్ట్ర విభజన జరిగి తీరుతుందని, రాష్ట్రం విడిపోతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ సీఎం కిరణ్ ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని, హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఆయనకు అలా మాట్లాడే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రాంత విద్యార్థులు హైదారాబాద్ లో విద్య అభ్యసించడంతోనే నగరం అభివృద్ధి చెందిందని వివరించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులే ముఖ్య పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని చులకన చేసి కొందరు సీమాంధ్ర నాయకులు మాట్లాడుతున్నారని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాంటి అవినీతి పరుల చరిత్రను పుస్తకరూపంలో ఉంచారని కవిత గుర్తుచేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి నవీనాచారి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం, సంస్కృతి కాపాడుకోవడం కోసం జాగృతి సంస్థ ప్రారంభమైందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *