mt_logo

ప్రవాస గొంతుక ఆవిర్భావం

మీ విలువైన సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. (ప్రవాస గొంతుక వేదిక నుండి కడియం, కల్వకంట్ల కవిత)
ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపటంలో ప్రతిపక్షాలకు సహకరించండి – సంకినెని వెంకటేశ్వర్ రావు , బి.జె.పి రాష్ట్ర ఉపాద్యక్షుడు
సూచనలతో పాటు, ఫిర్యాదులు చెయ్యండి – ఎల్.రమణ, పెద్ది రెడ్డి (టి.డి.పి ముఖ్య నేతలు)

అమెరికా తెలంగాణ ఆటా లో ప్రవాస గొంతుక.

అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో ఈ నెల జులై 8,9,10 తేదిల్లో అమెరికా తెలంగాణ అసోసియేషన్ ఆద్వర్యంలో జరిగిన తెలంగాణ మహ సభల్లో “ప్రవాస గొంతుక” ప్రొగ్రాంకు వివిద ప్రాంతాల నుండి వచ్చిన ఎన్.ఆర్.ఐ ల నుండి స్పందన బాగా వచ్చింది. దేశం కాని దేశం లో ఉద్యొగాలు చేస్తూ నిరంతరం మాతృభూమి అభివృద్ధి కొసం తపిస్తున్న ప్రవాస తెలంగాణ వారి గొంతుక ప్రజా ప్రభుత్వంకు చేరవేసే వేదిక ఇది అని, ఇటువంటి అవకాశం కల్పించిన ఆటా అద్యక్షుడు కొండా రామ్మోహన్ కు కృతజ్ఞతలు అని నిర్వాహకులు జలగం సుధీర్, విష్ణు మాధవరం తెలిపారు. ఈ ప్రొగ్రాంకు హజరైన డిప్యుటి సి.ఎం మాట్లాడుతూ ఎన్.ఆర్.ఐ.లు తమ విలువైన సలహాలు ఈ ప్రవాస గొంతుక ద్వారా ప్రభుత్వానికి చేరవెయటం సంతొషం అన్నారు. ఎం.పి కల్వకుంట్ల కవిత ఇటువంటి సరికొత్త ప్రొగ్రాం చేస్తున్నందుకు నిర్వహకుల్ని అభినందించి అమెరికాలోని అన్ని ప్రవాస తెలంగాణ సంఘాలు ప్రవాస గొంతుకను ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వానికి మేధావి వర్గాల విలువైనా సలహాలు అందజేయాలని కోరారు. . చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మేల్యేలు గాదరి కిషొర్, విద్యసాగర్ రావు, దయాకర్ రావు ,జీవన్ రెడ్డి, ఆరూరి రమెష్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, నారదాసు లక్ష్మన్ రావు లు, ప్లానింగ్ కమిషన్ డిప్యుటి చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తమ అభినందనలు రిజిస్టర్ లో రాసి ఎన్.ఆర్.ఐ ల సూచనలు ప్రభుత్వానికి అవసరం అన్నారు. తెలుగు దేశం నేతలు ఎల్.రమణ, పెద్ది రెడ్డి, బిజెపి నేత సంకినెని వెంకటెశ్వర్ రావు లు మాట్లడుతూ ఎన్.ఆర్.ఐ లు సలహలు ఇవ్వటంతో పాటు, పెద్ద ఎత్తున ప్రభుత్వ లోపాలను తెలియచేస్తు ప్రతిపక్షాలకు సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమం నిర్వహణకు ఎన్.ఆర్.ఐ టి.ఆర్.ఎస్, జాగృతి, వాటా (సియటెల్) సంస్థలు సహయం అందించగా, వివిద ప్రాంతాలా నుండి వచ్చిన ఎన్.ఆర్.ఐ లు ప్రభుత్వ పెద్దలకు తమ సలహలు, సూచనలు వ్యక్తిగతంగా అందచేయటంతో పాటు, అక్కడ ఉన్న సీల్డ్ బాక్స్ లో మరి కొన్ని ఫిర్యాదులు / సూచనలు అందచేసారు.

ఈ కార్యక్రమం విజయవంతం కావటం కోసం సహకరించిన వారిలో రాజ్ చీదెల్ల, బిందు చీదెల్ల, ఈశ్వర్ బండా, వినొద్ కుకునూర్, హరిందర్ తాల్లపల్లి, శ్రీకాంత్ పుస్కూరి, రఘు పొనుగోటి, శ్రిను సురభి, శ్రీధర్ బండారు, పూర్ణ బైరి, దెవెందర్ చిక్కాల, రఘువీర్ రీడ్డి, మహిధర్ రెడ్డి (సియటెల్), అప్పి రెడ్డి, సాయి రెడ్డి, అనిల్ ఎర్రబెల్లి, రాం కాసర్ల, శ్రీధర్ రంగినేని, నవీన్ జలగం, చందు తాల్ల, అరవింద్, నరసింహ, అభిలాష్, సక్రు నాయక్ తో పాటు చాలామంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *