mt_logo

మళ్లీ అబద్ధం ఆడి దొరికిపోయిన పరకాల!

అబద్ధాలనూ, అర్థసత్యాలతో అలవోకగా ఆర్గ్యుమెంట్ అల్లేయడంలో పరకాల ప్రభాకర్ భలే నేర్పరి. ఉద్యమ సమయంలోనూ ఇట్లాగే తెలంగాణ ఉద్యమం మీద అనేకసార్లు అవాకులూ, చవాకులూ పేలి భంగపడ్డాడు. తలకిందులు వేషాలు ఎన్నివేసినా, ఎన్ని గొడుగుల కింద చేరి అరిచి గీపెట్టినా తెలంగాణ ప్రజా ఉద్యమం ముందు నిలవలేకపోయాడు. రాష్ట్రావతరణ ఆపలేకపోయాడు.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే Ease of Doing Business – EODB ర్యాంకుల కొరకు నిస్సిగ్గుగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్లైన్ అప్లికేషన్లను దొంగిలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహారం బట్టబయలయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా మళ్లీ పరకాల తెరమీదికొచ్చిండు. మళ్లా అదే అడ్డగోలు వాదన షురూ జేసిండు.

 

“మేము EODB ర్యాంకింగుల్లో 2వ స్థానంలో ఉన్నాం, తెలంగాణ 13వ స్థానంలో ఉంది. వారిని మేమెందుకు కాపీ కొడతాం” అని మరో పచ్చి అబద్ధాన్ని మీడియా ముందుకొచ్చి వాగాడు.

రాష్ట్రాల EODB ర్యాంకింగులను కేంద్ర ప్రభుత్వ వెబ్సైటు http://eodb.dipp.gov.in లో ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడే తీసిన Screenshot ఇక్కడ పెట్టాం. దీని ప్రకారం తెలంగాణ రెండో స్థానంలో ఉంటే, ఏపి మూడో స్థానంలో ఉంది.

దీన్నిబట్టి నిరూపణ అయ్యేది ఏమిటంటే పరకాల చేస్తున్నది అబద్ధపు తొండి వాదన.

ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పి బతుకుతార్రా భయ్ మీరు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *