సవతితల్లి చేతిలో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడిన ప్రత్యూష గ్లోబల్ ఆస్పత్రి నుండి ఈరోజు డిశ్చార్జ్ అయ్యింది. పోలీసులు ప్రత్యూషను గ్లోబల్ ఆస్పత్రి నుండి నేరుగా హైకోర్టుకు తరలించి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ప్రత్యూషతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 25 నిమిషాలపాటు మాట్లాడారు. అంతేకాకుండా ప్రత్యూషకు అండగా ఉంటామన్న సీఎం కేసీఆర్ ను ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. ప్రత్యూషను సీఎం అధికారిక నివాసానికి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఆమెను ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి తీసుకెళ్ళారు.
హైకోర్టు నుండి సీఎం అధికారిక నివాసానికి వెళ్ళిన ప్రత్యూషను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి లోపలికి ఆహ్వానించి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యూష భోజనం చేసింది.