mt_logo

హార్టీకల్చర్ యూనివర్సిటీకి 4.922 హెక్టార్ల స్థలం కేటాయించిన ప్రభుత్వం..

మెదక్ జిల్లా ములుగులో కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో నెలకొల్పే ఉద్యానవన విశ్వవిద్యాలయం కోసం 4.922 హెక్టార్ల స్థలం కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హార్టీకల్చర్ యూనివర్సిటీతో పాటు గజ్వేల్ లో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హార్టీకల్చర్ యూనివర్సిటీ పనులు త్వరగా ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. గజ్వేల్ పట్టణంలో బాలురు, బాలికల కోసం ఏర్పాటు చేయనున్న వేర్వేరు ఎడ్యుకేషన్ హబ్స్ డిజైన్లను, హౌసింగ్ కాలనీల లేఅవుట్లను, ఆడిటోరియంలను సీఎం పరిశీలించి ఆమోదించారు.

ఇదిలాఉండగా హైదరాబాద్ లోని మారేడుపల్లిలో క్రిస్టియన్ భవనాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. భవన నమూనాను, లేఅవుట్ ను ముఖ్యమంత్రి గురువారం ఆమోదించారు. రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న క్రిస్టియన్ భవన్ లో ఆడిటోరియం, డైనింగ్ హాల్స్ తదితరాలు ఉండేవిధంగా డిజైన్ ను రూపొందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *