mt_logo

టీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్..

వరంగల్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పసునూరి దయాకర్ పేరును పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. పార్టీ ఆవిర్భావం నుండి సాధారణ కార్యకర్తగా పనిచేసిన దయాకర్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా గత రెండు ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్ ఛార్జిగా పనిచేశారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ తల్లి విగ్రహాలను అన్ని ఊర్లలో ప్రతిష్ఠించడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

వరంగల్ జిల్లా సంగెం మండలం బొల్లికుంట గ్రామానికి చెందిన పేద దళిత కుటుంబంలో జన్మించిన దయాకర్ 2001 లోనే టీఆర్ఎస్ పార్టీలో చేరి సాధారణ కార్యకర్త స్థాయినుండి జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదిగారు. కళల పట్ల చిన్నప్పటి నుండి అభిరుచి ఉన్న దయాకర్ హైదరాబాద్ లోని జేఎన్టీయూలో బీఏ ఫైన్ ఆర్ట్స్ చేశారు. దాదాపు వెయ్యి దాకా తెలంగాణ తల్లి విగ్రహాలను స్వయంగా తయారుచేశారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి జిల్లాలో యువకుల్ని పార్టీలోకి ఆకర్షించారు. పార్టీ ఆవిర్భావం నుండి పనిచేసిన వారికి అవకాశాలు వస్తాయని దయాకర్ అభ్యర్ధిత్వం రుజువు చేసిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *