mt_logo

పార్లమెంటు సమావేశాలు వచ్చేనెల 5నుండే

తెలంగాణ బిల్లుసహా మరికొన్ని బిల్లులపై చర్చించి ఆమోదం తెలిపేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఫిబ్రవరి 5నుండి 21వరకూ జరగనున్నాయి. ఈ సమావేశాలు శీతాకాల సమావేశాలకు కొనసాగింపుగా ఉంటాయని, ఓటాన్ అకౌంట్ 17వ తేదీన ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ విలేకరుల సమావేశంలో తెలిపారు. గురువారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి ఏకే. ఆంటోనీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమల్ నాథ్ పాల్గొన్నారు. ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సందర్భంలో కొన్ని ప్రత్యేక బిల్లులైన తెలంగాణ బిల్లు,అవినీతి నిరోధక బిల్లు, సిటిజన్ చార్టర్ బిల్లు, ఎలక్ట్రానిక్ డెలివరీ సర్వీసెస్ బిల్లు, విదేశీ అధికారుల ముడుపుల నివారణ బిల్లు, న్యాయ జవాబుదారీ బిల్లు, విజిల్ బ్లోయర్స్ రక్షణ బిల్లు మొదలైనవి ఓటాన్ అకౌంట్ కు పంపించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ బిల్లుపై ఎక్కువ సమయం చర్చకు కేటాయించి ఆమోదం తెలుపుతారని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు గడువు కూడా ఇవ్వరని తేలిపోవడంతో ఫిబ్రవరి 5నుండే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *