– జూన్ 4న మెల్బోర్న్‌లో ఆవిర్భావ సభ
ఎన్నారై టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా శాఖ ఆవిర్భావ సభ పోస్టర్‌ను నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్‌లో ఆవిష్కరించడం జరిగింది.
ఆస్ట్రేలియా నుండి వచ్చిన ఎన్నా రై టీ.ఆర్.ఎస్ సెల్ ప్రతినిథులు అనిల్ బైరెడ్డి మరియు నాగేందర్ కాసర్ల ముందుగా కవిత గారికి ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
జూన్ 4వ తేదీన మెల్బోర్న్‌లో ఎన్నారై టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా శాఖను కవిత గారు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై టీ.ఆర్.ఎస్ అధ్యక్షులు అనిల్ కుర్మాచలం, ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ శానబోయిన, సెక్రటరీ నవీన్ రెడ్డి, ఆస్ట్రేలియా ఇంచార్జ్ అనిల్ బైరెడ్డి, అధికార ప్రతినిధి నాగేందర్ కాసర్ల పాల్గొన్నారు.