శాసనసభలో ఎమ్మెల్యే జూపల్లి మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు సోనియాగాంధీకి కృతజ్ఞతలు చెప్పే విషయంపై ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను పది నిమిషాలపాటు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం రాజయ్య మాట్లాడుతూ ఆరోజు ఇచ్చిన తెలంగాణను వెనక్కు తీసుకోవడం నోటికాడి బుక్కను లాక్కున్నట్లుగా అయ్యిందని, అందుకే ఆత్మబలిదానాలు జరిగాయని అన్నారు.
సోనియా గాంధీ అంటే ఎనలేని గౌరవం ఉందని, ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి జై తెలంగాణ అన్నది తానేనని రాజయ్య చెప్పారు. తెలంగాణ ప్రకటించినప్పుడు కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పామని, సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లి సోనియాకు కృతజ్ఞతలు తెలిపారని రాజయ్య గుర్తుచేశారు.