తెలంగాణ అంటే తుఫాన్ కాదని, సునామీ అని, దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, సిరిసిల్ల ఎమ్మెల్లే కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఒక్కపైసా కూడా ఇవ్వనన్న కిరణ్, తుఫాన్ ను ఆపలేకపోయాను కానీ, విభజనను ఆపుతానని మూర్ఖంగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. తెలంగాణ వస్తే సీమాంధ్రకు నీళ్ళూ, ఉద్యోగాలు రావని కిరణ్ చెప్పడం, దానికి ఉండవల్లి వంత పాడటం చాలా హాస్యాస్పదంగా వుందన్నారు.
తెలంగాణలో ఉద్యమం, ఆత్మబలిదానాల ఫలితంగానే రాష్ట్రం సిద్దిస్తుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ బిల్లు పాసయ్యాకనే సంబురాలు జరుపుకుందామని ఆయన అన్నారు.
రాబోయే తెలంగాణ లో పునర్నిర్మాణం, అభివృద్దికి సంబంధించి కేసీఆర్ వద్ద స్పష్టమైన విధివిధానాలు వున్నాయని తెలంగాణను అభివృద్ధి చేసే సరైన నాయకుడు మాత్రం ఆయనేనని పేర్కొన్నారు.