మామూలు రాజకీయనాయకుల కన్నా మావోడు చాలా డిఫరెంటు అంటుంటారు నాగబాబా భక్తులు. కానీ బాబావారు ఇతర రాజకీయ నాయకుల కన్నా బాగా ముదురు టైపు అని ఈ మధ్య చాలామందికి అర్థం అవుతోంది.
తాజాగా నాగబాబా గారు మరో గొప్ప మాటన్నారు.
బేగంపేటలోని శ్యాంలాల్ బస్తీలో 5.8 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజి లైనుకు నాగభైరవ జయప్రకాశ్ నారాయణ నిన్న శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో స్థానికులు కొందరు అక్కడి అధికారుల పనితీరు బాగాలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
అంతే. నాగబాబాకు కోపం నషాళానికి అంటింది.
“మీకు సిగ్గుందా…? ప్రజలు చెల్లిస్తున్న పన్నులతో జీతాలు తీసుకుంటూ ఒక్క సమస్యనైనా సరిగ్గా పరిష్కరించరు. ఈసారి చెప్పిన టైంలోపు పని పూర్తి చేయకున్నా, నిర్లక్ష్యం వహించినా అందరిముందూ ప్రజలతోనే కొట్టిస్తా” అని రంకెలు వేశారు.
అసెంబ్లీలో పరమ సాధు జంతువులా విలువలు ప్రవచించే బాబాగారు ఈ విధంగా ఫక్తు గల్లీ లీడర్ లా ప్రవర్తించే సరికి విస్తుపోవడం అధికారుల వంతు అయ్యింది.
తానూ ఒకప్పుడు ప్రభుత్వ అధికారినే అన్న విషయం మరిచిపోయి సాటి ప్రభుత్వోద్యోగులను ఇలా దెబ్బలు కొట్టిస్తానని బెదిరించడం సబబని బాబాగారి చంకలో ఉండే రాజ్యాంగంలోని ఏ పేజీలో ఉందో మరి…