Mission Telangana

రెండు యాత్రలు – ఒక సీమాంధ్ర పత్రిక

నారా చంద్రబాబు బినామీ అని అందరూ నమ్మే మాజీ కిరోసిన్ స్మగ్లర్ రాధా కృష్ణ నడుపుతున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక రోజురోజుకీ బరితెగిస్తున్నది.

మొదట్లో కొన్నాళ్లు తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చిన ఈ పచ్చజ్యోతి ఇటీవల తన ముసుగులన్నీ తీసి అవతల పారేసింది. పచ్చపార్టీకి కరపత్రికగా మారి పచ్చి అబద్దాలను, అర్ధ సత్యాలను కలిపి పాఠకుల ముంగిట గుమ్మరిస్తోంది. తెలంగాణ ఉద్యమంపై గత కొన్నాళ్లుగా మొదటి పేజీ బ్యానర్ నుండి సంపాదకునికి ఉత్తరాల పేజీ వరకూ ఎక్కడా వదలకుండా విషం చిమ్ముతున్నది ఈ పత్రిక.

మచ్చుకు మొన్నటి పత్రికలో చంద్రబాబు రైతు యాత్రకు, కిషన్ రెడ్డి తెలంగాణ పోరు యాత్రకు ఆ పత్రిక ఇచ్చిన కవరేజి చూడండి.

చంద్రబాబు యాత్రకేమో రెండో పేజీలో “పోటెత్తిన జనం” అనే ఒక పెద్ద వార్త వేసింది. అది సరిపోదన్నట్టు తొమ్మిదో పేజిలో  “అడ్డొస్తే ఎవరైనా ఫినిషే” అంటూ అదే యాత్రకు మరో వార్త వేసి స్వామి భక్తితో రంకెలేసింది.

అదే రోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంతో ప్రజాదరణ మధ్య చేస్తున్న తెలంగాణ పోరు యాత్ర గురించి రాయడానికి మాత్రం ఈ సీమాంధ్ర జ్యోతికి చేతులు రాలేదు. ఆ రోజు పత్రికలో తెలంగాణ పోరు యాత్ర గురించి ఒక్క ఫొటో కానీ ఒక్క అక్షరం కానీ అచ్చువేసిన పాపాన పోలేదీ పచ్చపత్రిక.

ఈ ఫొటోలు చూడండి. ఇంతమంది ప్రజలు తెలంగాణ పోరు యాత్రకు వెల్లువెత్తుతుంటే ఈ పచ్చపత్రిక మాత్రం కళ్లులేని కబోధి లా మారింది.

ఇటువంటి సీమాంధ్ర పత్రికలను బొందపెట్టకుంటే అవి మన ఉద్యమానికి చేసే హానీ అంతా ఇంతా కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *