పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని, కేవలం నిత్యావసర సరుకులకే ఇది వర్తిస్తుందని ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. రంగారెడ్డి జెడ్పీ హాల్ లో మిషన్ కాకతీయపై జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఈటెల మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని, మిషన్ కాకతీయను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు.
రేపటి బంగారు తెలంగాణకు సమగ్ర కుటుంబ సర్వే ఒక పునాది వంటిదని, అర్హులైన పేదలందరికీ ఆహార భద్రత కార్డులిస్తామని, కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తామని ఈటెల పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు, ఇతర కార్డులతో సంబంధం లేదని, ఆహార భద్రత కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.