mt_logo

రూ. 94 కోట్లతో మూసారాంబాగ్, చాదర్ ఘాట్ కు నూతన వంతెనలు : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మూసారాంబాగ్ మూసీ పరివాహక వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పర్యటించారు. బ్రిడ్జి పునరుద్దరణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ… మూసారాంబాగ్ హైలెవెల్ బ్రిడ్జికి రూ.52 కోట్లు, చాదర్ ఘాట్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.42 కోట్లు నిధులు కేటాయించామన్నారు. 10 రోజుల్లో ఈ నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అలాగే మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తామని, ముంపు సమస్యలు నివారించడం కోసం ఎస్‌ఎన్‌డిపి పనులు చేపడతామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో మూసీ వరదలకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మంత్రి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *