పార్లమెంటులో కబడ్డీ ఆడుకుంటానన్న పెప్పర్ స్ప్రే లగడపాటిని నేషనల్ మీడియా ఫుట్బాల్ ఆడుకుంది. గురువారం పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరుపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియా దుమ్మెత్తి పోసాయి. అత్యంత నీతిమాలిన, సిగ్గుపడాల్సిన సంఘటనగా దానిని అభివర్ణించారు. లైవ్ చర్చలకు లగడపాటి, సీఎం రమేష్ లను పిలిచి వారి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. దేశమంతటా దోషిగా నిర్ధారించబడ్డ లగడపాటిని సీమాంధ్ర మీడియా హీరోని చేసి భగత్ సింగ్ టైటిల్ ను ఇచ్చింది. టైమ్స్ నౌ నిర్వహించిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఏకంగా లగడపాటిని ఫుట్బాల్ ఆడుకున్నారు. ‘పెప్పర్ లగడపాటి’ అని వ్యాఖ్యానిస్తూ లోక్ సభలో జరిగిన సంఘటన పట్ల నీకు సిగ్గులేదా? అని అన్నారు. నా పార్లమెంటును నువ్వు నవ్వులపాలు చేసావని అన్నారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడుగగా నీకు అసలు మాట్లాడే అవకాశం ఇవ్వనని, నువ్వు ఇష్టానుసారం మాట్లాడడానికి పార్లమెంటు నీది కాదు, మాది అని మండిపడ్డారు. ముందు నువ్వు దేశానికి క్షమాపణలు చెప్పు, రౌడీలా ప్రవర్తించావు. నిన్ను అసలు పార్లమెంటులోకి అనుమతించొద్దు. నీ ప్రవర్తనను గుర్తు తెచ్చుకుని సిగ్గుపడు అని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. ఇది పార్లమెంటు. పార్లమెంటులో కబడ్డీ ఆడుతావా? అసలేం అనుకుంటున్నావు నువ్వు? పెప్పర్ స్ప్రే రాజగోపాల్ గా ఫేమస్ అయ్యావు. నిన్ను చూసి దేశమంతా సిగ్గుపడుతుంది. నిన్ను అటాక్ చేస్తేనే స్ప్రే చేశానని అంటున్నావు కదా, ఎవరు నీపై అటాక్ చేశారో తెలుసా? అని అడగ్గా, వందమంది తనపై దాడి చేశారని, వారెవరో తనకు తెలియదని తప్పించుకున్నారు. వెంటనే అర్నాబ్ స్పందిస్తూ ఏం మాట్లాడుతున్నావు రాజగోపాల్ వెల్ లో వందమంది ఉన్నారా? క్రిమినల్ గా బిహేవ్ చేశావు. భారతదేశ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తివి నీవు. పార్లమెంటులో నువ్వు చేసింది ఉగ్రవాద దాడి. నీలాంటి వారు రాజకీయ, పార్లమెంటరీ, ప్రజాస్వామ్యం లో ఉండడానికి సిగ్గుపడాలని మండిపడ్డారు. నువ్వు చేసినదానికి ముందు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. పార్లమెంటు అంటే సర్కస్ కాదు. ఇలాగే చేస్తానంటే ముందు రాజీనామా చేసి బయటకు వచ్చి ఆటలాడుకో అని అన్నారు. న్యారో, సెల్ఫ్, పొలిటికల్ ఇంట్రస్ట్ లతో లగడపాటి మాట్లాడటం ఈ దేశానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఎన్డీ టీవీ ఎడిటర్ బర్కాదత్ కూడా లైవ్ చర్చలో లగడపాటిపై మండిపడ్డారు. రాజగోపాల్, అసలు పెప్పర్ స్ప్రే ఎందుకు తీసుకెళ్లావు? పెప్పర్ స్ప్రే ను ఆడవాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడుతారు. అలాంటి స్ప్రే నీకు ఎందుకు? ఆడదాన్ని నేనే దాన్ని వాడను. మగాడివి నీకెందుకు? నువ్వేమన్నా వీధిలో వెళ్తున్నావా? పార్లమెంటులోనే కదా ఉన్నది. అక్కడున్నది కూడా నీ తోటి ఎంపీలే కదా? పెప్పర్ స్ప్రే ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎన్-ఐబీఎన్ ఛానల్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ లగడపాటి తో చర్చలో మాట్లాడుతూ ఇంకా నయం ఏకే 47 తేలేదు. పెప్పర్ స్ప్రే మాత్రమే వాడారు. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అన్నారు.
- Tamil Nadu requests 7 lakh tonnes boiled rice from Telangana
- KTR’s effort pays off; Telangana man languishing in Dubai jail to be freed
- Distribution of double bedroom houses is done in a very transparent manner: KTR
- Genome Valley to be expanded in another 250 acres: KTR
- Minister KTR inaugurates Eurofins BioPharma Services Campus in Hyderabad
- సీఎం కేసీఆర్ సంకల్పం.. దేశానికే బువ్వగిన్నెలా రాష్ట్రం.. తెలంగాణ బియ్యం కోసం పక్క రాష్ట్రాల క్యూ!
- ధనవంతుల ఇండ్ల తరహాలో జీహెచ్ఎంసీలో రూ. 10 వేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు: మంత్రి మహేందర్ రెడ్డి
- కేసీఆర్ జనాలకు కిట్లు ఇస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీ తిట్లు ఇస్తున్నాయి: మంత్రి హరీష్ రావు
- హైదరాబాద్లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ రూ. 50 వేల నుండి 60 వేల కోట్లు: మంత్రి కేటీఆర్
- బీజేపీ చిల్లర రాజకీయం.. మొన్న కశ్మీర్ ఫైల్స్.. నేడు రజాకార్.. భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకొనే కుట్ర!
- తెలంగాణ ప్రభుత్వ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలా? అయితే ఈ వాట్సాప్ చానల్ ఫాలో అవ్వండి
- 33% మహిళా కోటలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత
- సామాజిక పింఛన్ల ఖాళీల్లో వారి భార్యలకు వెంటనే మంజూరు చేయాలి: సీఎస్ శాంతి కుమారి
- రైతు సంక్షేమంపై తగ్గేదే లే.. రుణమాఫీ కోసం నిధులు విడుదల చేసిన తెలంగాణ సర్కారు
- పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ వేసిన కేసును ట్రిబ్యూనల్ కొట్టివేయడం పాలమూరు విజయం: మంత్రి సింగిరెడ్డి