mt_logo

లగడపాటిని ఉతికిపారేసిన జాతీయ మీడియా

పార్లమెంటులో కబడ్డీ ఆడుకుంటానన్న పెప్పర్ స్ప్రే లగడపాటిని నేషనల్ మీడియా ఫుట్‌బాల్ ఆడుకుంది. గురువారం పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీలు ప్రవర్తించిన తీరుపై జాతీయ, అంతర్జాతీయ పత్రికలు,ఎలక్ట్రానిక్ మీడియా దుమ్మెత్తి పోసాయి. అత్యంత నీతిమాలిన, సిగ్గుపడాల్సిన సంఘటనగా దానిని అభివర్ణించారు. లైవ్ చర్చలకు లగడపాటి, సీఎం రమేష్ లను పిలిచి వారి వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. దేశమంతటా దోషిగా నిర్ధారించబడ్డ లగడపాటిని సీమాంధ్ర మీడియా హీరోని చేసి భగత్ సింగ్ టైటిల్ ను ఇచ్చింది. టైమ్స్ నౌ నిర్వహించిన చర్చలో ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి ఏకంగా లగడపాటిని ఫుట్‌బాల్ ఆడుకున్నారు. ‘పెప్పర్ లగడపాటి’ అని వ్యాఖ్యానిస్తూ లోక్ సభలో జరిగిన సంఘటన పట్ల నీకు సిగ్గులేదా? అని అన్నారు. నా పార్లమెంటును నువ్వు నవ్వులపాలు చేసావని అన్నారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వమని అడుగగా నీకు అసలు మాట్లాడే అవకాశం ఇవ్వనని, నువ్వు ఇష్టానుసారం మాట్లాడడానికి పార్లమెంటు నీది కాదు, మాది అని మండిపడ్డారు. ముందు నువ్వు దేశానికి క్షమాపణలు చెప్పు, రౌడీలా ప్రవర్తించావు. నిన్ను అసలు పార్లమెంటులోకి అనుమతించొద్దు. నీ ప్రవర్తనను గుర్తు తెచ్చుకుని సిగ్గుపడు అని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. ఇది పార్లమెంటు. పార్లమెంటులో కబడ్డీ ఆడుతావా? అసలేం అనుకుంటున్నావు నువ్వు? పెప్పర్ స్ప్రే రాజగోపాల్ గా ఫేమస్ అయ్యావు. నిన్ను చూసి దేశమంతా సిగ్గుపడుతుంది. నిన్ను అటాక్ చేస్తేనే స్ప్రే చేశానని అంటున్నావు కదా, ఎవరు నీపై అటాక్ చేశారో తెలుసా? అని అడగ్గా, వందమంది తనపై దాడి చేశారని, వారెవరో తనకు తెలియదని తప్పించుకున్నారు. వెంటనే అర్నాబ్ స్పందిస్తూ ఏం మాట్లాడుతున్నావు రాజగోపాల్ వెల్ లో వందమంది ఉన్నారా? క్రిమినల్ గా బిహేవ్ చేశావు. భారతదేశ రాజకీయాల్లో ఉండకూడని వ్యక్తివి నీవు. పార్లమెంటులో నువ్వు చేసింది ఉగ్రవాద దాడి. నీలాంటి వారు రాజకీయ, పార్లమెంటరీ, ప్రజాస్వామ్యం లో ఉండడానికి సిగ్గుపడాలని మండిపడ్డారు. నువ్వు చేసినదానికి ముందు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పు. పార్లమెంటు అంటే సర్కస్ కాదు. ఇలాగే చేస్తానంటే ముందు రాజీనామా చేసి బయటకు వచ్చి ఆటలాడుకో అని అన్నారు. న్యారో, సెల్ఫ్, పొలిటికల్ ఇంట్రస్ట్ లతో లగడపాటి మాట్లాడటం ఈ దేశానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ఎన్డీ టీవీ ఎడిటర్ బర్కాదత్ కూడా లైవ్ చర్చలో లగడపాటిపై మండిపడ్డారు. రాజగోపాల్, అసలు పెప్పర్ స్ప్రే ఎందుకు తీసుకెళ్లావు? పెప్పర్ స్ప్రే ను ఆడవాళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం వాడుతారు. అలాంటి స్ప్రే నీకు ఎందుకు? ఆడదాన్ని నేనే దాన్ని వాడను. మగాడివి నీకెందుకు? నువ్వేమన్నా వీధిలో వెళ్తున్నావా? పార్లమెంటులోనే కదా ఉన్నది. అక్కడున్నది కూడా నీ తోటి ఎంపీలే కదా? పెప్పర్ స్ప్రే ఎందుకు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఎన్-ఐబీఎన్ ఛానల్ ఎడిటర్ రాజదీప్ సర్దేశాయ్ లగడపాటి తో చర్చలో మాట్లాడుతూ ఇంకా నయం ఏకే 47 తేలేదు. పెప్పర్ స్ప్రే మాత్రమే వాడారు. అందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *