mt_logo

నగరానికి బతుకమ్మ శోభ

బతుకమ్మ ఉత్సవాల్లో చివరి రోజైన సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. మిరుమిట్లుగొలిపే విద్యుత్ దీపాలతో శోభాయమానంగా మెరిసిపోతున్నది. పెద్ద పెద్ద కటౌట్లు, డెకరేషన్ లైట్లతో చౌరస్తాలు జిగేల్‌మంటున్నాయి. ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, సెక్రెటేరియట్ పరిసరాలు రంగురంగుల లైట్లతో కనువిందు చేస్తున్నాయి. సద్దుల బతుమ్మను టాంక్‌బండ్‌పై ప్రభుత్వం నిర్వహించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నది. బతుకమ్మ పండుగను ప్రభుత్వమే నిర్వహించడంతో భారీ స్పందన వస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *