mt_logo

సీఎం కేసీఆర్ ను కలిసిన నాబార్డు చైర్మన్..

ముఖ్యమంత్రి కేసీఆర్ ను నాబార్డ్ సీజీఎం మెమెన్ సచివాలయంలో కలిశారు. మిషన్ కాకతీయకు ఈ సంవత్సరం రూ.360 కోట్లు అందిస్తామని, వచ్చే ఏడాది రూ. 500 కోట్లు ఇస్తామని చెప్పారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి నుండి వాటర్ గ్రిడ్ కోసం రూ. 5 వేల కోట్ల ఆర్ధికసాయం చేస్తామని, వాటర్ గ్రిడ్ కు ఈ సంవత్సరం రూ.వెయ్యి కోట్లు సాయం చేస్తామని, ప్రాజెక్టును దశలవారీగా చేపట్టాలని సీఎంకు మెమెన్ విజ్ఞప్తి చేశారు. నాబార్డు ప్రతిపాదనలను సీఎం స్వాగతిస్తూ హైదరాబాద్ లో నాబార్డు భవనానికి భూమి ఇచ్చేందుకు అంగీకరించారు.

మరోవైపు శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి సచివాలయంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కలిసి వాక్సిన్ ఉత్పత్తులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో వాక్సిన్ ఉత్పత్తులకు ప్రభుత్వం నుండి కావాల్సిన ప్రోత్సాహం లభిస్తుందని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాక్సిన్లను పరీక్షించే ల్యాబ్ ఏర్పాటుకు భూమి, ఆర్ధికసాయం అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ లో ల్యాబ్ పెట్టడం వల్ల తెలంగాణకే కాక దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *