mt_logo

వాషింగ్టన్ డీసీలో ఘనంగా బతుకమ్మ సంబురాలు..

తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ వేడుకలకు అమెరికాలోని వర్జీనియా, డీసీ, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ కార్యనిర్వహణ అధ్యక్షులు బండారు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సుమంత్, విజన్ తెలంగాణ అసోసియేషన్ అద్యక్షులు విజయ్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జగదీష్ బొందుగుల తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *