తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమెరికాలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ వేడుకలకు అమెరికాలోని వర్జీనియా, డీసీ, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ జాగృతి నార్త్ అమెరికా శాఖ కార్యనిర్వహణ అధ్యక్షులు బండారు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి సుమంత్, విజన్ తెలంగాణ అసోసియేషన్ అద్యక్షులు విజయ్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జగదీష్ బొందుగుల తదితరులు పాల్గొన్నారు.