mt_logo

వి-హ‌బ్ తో సెర్ప్ ఎంవోయు..

ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌ల‌కు శిక్ష‌ణ‌ నిచ్చే విమెన్-హ‌బ్ సంస్థ‌తో నిరుపేద ఔత్సాహిక మహిళ‌ల‌కు పరిశ్ర‌మ‌ల మీద శిక్ష‌ణ‌నిచ్చేందుకు వీలుగా సెర్ప్ ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చింది. హైద‌రాబాద్ లోని రాజేంద్ర‌న‌గ‌ర్-‌‌టిఎస్ఐపార్డ్ లో గురువారం జ‌రిగిన ఫుడ్ ప్రాసెసింగ్ వ‌ర్క్ షాపులో రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు స‌మ‌క్షంలో ఈ ఎంఓయు జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సెర్ప్ సీఈవో సందీప్ కుమార్ సుల్తానియా, వి-హ‌బ్ సీఈవో దీప్తి రెడ్డిలు ఎంఓయు ప‌త్రాల‌ను ప‌ర‌స్ప‌రం అందుకున్నారు. కాగా, ఈ ఒప్పందం ప్ర‌కారం ప‌రిశ్ర‌మ‌ల శాఖ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న వి-హ‌బ్, సెర్ప్ ఆధ్వ‌ర్యంలోని నిరుపేద మ‌హిళ‌ల‌కు ఫుడ్ ప్రాసెసింగ్ ప‌లు అంశాల‌పై శిక్ష‌ణను ఇస్తుంది. మ‌హిళ‌ల సాధికార‌త దిశ‌గా ప‌ని చేయాల‌ని రెండు సంస్థ‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఈ సంద‌ర్భంగా సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *