కాంగ్రేస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కామారెడ్డి లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ ప్రాంతలో కాంగ్రెస్ పార్టికి ఉన్న ఆదరణ అంతంత మాత్రమే కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా సభకు హాజరు కారని తెలిసిన కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచి జన సమీకరణ చేసినట్టు తెలుస్తుంది.
డబ్బులనే నమ్ముకున్న ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ అశావహుడు ఈ సభ కోసం పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కుమ్మరించాడని వినికిడి. బాన్స్ వాడ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న ఈ సదరు నేత తన స్వంత మండలం అయిన కోటగిరి నుండి కామారెడ్డి సభకు జనాన్ని తరలించడానికి వాహనాలను పెద్దఎత్తున సమకుర్చాడన్నది సమాచారం. అయితే ఆయనకక్కడ కార్యకర్తల బలం లేకపోవడంతో అయన పెట్టిన వాహనాల్లో ఎక్కడానికి జనాలెవ్వరూ లేకపోవడంతో దిక్కుతోచని ఆ నాయకుడు, అతని అనుచరగణం అడ్డాకూలీలకు, సామాన్య జనాలకు డబ్బులు, మందు, బిర్యాని పొట్లాలు పంపిణి చేసి జన సమీకరణ చేసారు. కాంగ్రెస్ పార్టీ కోటగిరి మండల అధ్యక్షుడు సలీం సభకొచ్చిన వారికి డబ్బుల పంచుతూ కెమరాకు దొరికిపోవడంతో ఈ బండారమంతా బయటపడింది.
అటు పేలవంగా ఉన్నరాహుల్ గాంధీ ప్రసంగం, ఇటు డబ్బులు వెదజల్లినా అంతంత మాత్రంగానే వచ్చిన జనాలు, కాంగ్రెస్ నాయకుల్ని నీరసానికి గురిచేస్తున్నాయని లోకల్ రిపోర్ట్.