mt_logo

సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి స్త్రీలకు ఉంది : హిజాబ్ వివాదంపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

దేశంలో ముదురుతున్న హిజాబ్ వివాదం, మహిళల వస్త్రధారణ విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు …హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలన్నారు. స్త్రీలు సృష్టికర్తలని, సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి వారికి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను రాసిన కవితను ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..
మతమేదైనా సరే…
మనమంతా భారతీయులమే..
సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…
“త్రివర్ణ పతాకాన్ని” రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
“జై హింద్” అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
“సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ ” అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
“జన గణ మన” తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *