mt_logo

బాబును కడిగి పారేస్తేనే మీకు తెలంగాణ పౌరుషం ఉన్నట్లు!

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. రైతులు, మద్యం, ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడం వంటి అంశాల గురించి టీడీపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మండిపడ్డారు. వీటిపై మీరు ఆందోళనలు పక్క రాష్ట్రంలో చేయండని, చంద్రబాబు గల్లా పట్టుకుని నిలదీయాలని టీడీపీ నేతలకు సూచించారు. తెలంగాణకు చేయాల్సినంత ద్రోహం చేసి ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేతలు పూటకో డ్రామాతో మొసలి కన్నీరు కారిస్తే ప్రజలు నమ్మరని చెప్పారు.

పాలమూరు, డిండి లాంటి ఎత్తిపోతల పథకాలకు అడ్డుపడుతూ కేంద్రానికి ఇప్పటికే 12 లేఖలు ఎందుకు రాశాడో చంద్రబాబును కడిగి పారేయండని, అప్పుడే మీకు తెలంగాణ పౌరుషం ఉన్నట్లు ప్రజలు గుర్తిస్తారని అన్నారు. తెలంగాణలో శాశ్వతంగా కరువు నివారించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రాజెక్టులు చేపడుతుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని చంద్రబాబును నిలదీయాలని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే అప్పుడు మత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఉన్న టీటీడీపీ నేతలు నిద్రపోయారా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణకు శనిలా దాపురించాడని వెంకటేశ్వర్లు మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *