mt_logo

తెలంగాణాలో మహిళలకు అన్ని రంగాల్లో పెద్ద పీట : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినీమా టోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆద్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలకు సేవా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పిలుపుతో 3 రోజులుగా ప్రపంచ మహిళా దినోత్సవం వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళల కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ క్రింద ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం క్రింద ఇప్పటి వరకు 11 లక్షల మండి వరకు లబ్ధిదారులకు ఆర్ధిక సహాయం అందజేయడం జరిగిందని వివరించారు. గర్బిణి మహిళలను ప్రసవం కోసం ఆసుపత్రికి తీసుకెళ్ళేందుకు, ప్రసవం అనంతరం ఇంటికి క్షేమంగా చేర్చేందుకు అమ్మ ఒడి కార్యక్రమం క్రింద 300 వాహనాలను ఏర్పాటు చేసిందని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించిన మహిళలకు కే‌సి‌ఆర్ కిట్ క్రింద బిడ్డ, తల్లి కి అవసరమైన సామాగ్రి తో పాటు 13 వేల రూపాయల నగదును అందిస్తున్నట్లు తెలిపారు. ఇవే కాకుండా మహిళలు, విద్యార్ధినుల భద్రత కోసం ప్రభుత్వం షీ టీం లను ఏర్పాటు చేసిందని చెప్పారు. విద్యా, ఉద్యోగం రాజకీయ తదితర రంగాలలో ప్రభుత్వం సమాన హక్కును కల్పిస్తుందని అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో 150 స్థానాలు ఉంటే 75 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. గతంలో ఎండాకాలం వస్తే నీళ్ల కోసం ధర్నాలు జరిగేవి.. మారుమూల ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకునేవారని, మహిళల ఇబ్బందులను దృష్టి లో ఉంచుకొని మిషన్ భగీరధ క్రింద ఇంటింటికి త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు అడగకుండానే జీతాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ఆడ బిడ్డల బతుకమ్మ పండుగ నేడు ప్రపంచ వ్యాప్తమైందని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. అనంతరం మహిళలతో కలిసి మంత్రి బోజనం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాధ్ తదితరులతోపాటు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *