మహిళల సఖీ కేంద్ర శాశ్వత భవనాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్

  • January 24, 2022 3:10 pm

మహిళల అన్ని సమస్యల పరిష్కారం కోసం ఒన్ స్టాప్ సెంటర్ గా పని చేస్తున్న సఖీ కేంద్ర శాశ్వత భవనాన్ని నేడు ములుగు జిల్లాలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. 49 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ భవనంలో మహిళలకు అత్యవసర పునరావాసం కోసం గదులు, పోలీస్ సాయం, న్యాయ సాయం, వైద్య సాయం వంటి అన్ని వసతులు ఈ భవనంలో ఉంటాయని చెప్పారు. దీంతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ రవాణా సదుపాయం పథకం కింద కోటి రూపాయల విలువైన 10 రవాణా వాహనాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను, మహిళా హెల్ప్ లైన్ 181 పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడిలకు చీరలు పంపిణీ చేసి, అక్కడే నిర్మాణం జరుగుతున్న ఆర్&బి గెస్ట్ హౌజ్ పనులను పరిశీలించడంతో పాటు, చల్వాయి క్రాస్ రోడ్ నుంచి లక్నవరం వరకు రోడ్డు అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయల పనికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీ మాలోతు కవిత, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, తదితర స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE