mt_logo

తెలంగాణ విద్యార్థి ప్రపంచంలో ఎక్కడైనా రాణించగలడు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగాణ విద్యార్థి రాణించేలా సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నందున, విద్యార్థులు బాగా చదివి తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మొయినాబాద్ మండలం ఎత్‌బార్‌పల్లిలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలను మంగళవారం మంత్రి సబిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇంటర్ విద్య జీవితంలో కీలక మలుపు అని, సరైన బాటలు ఇక్కడి నుండే వేసుకోవాలని, విజేతలను స్ఫూర్తిగా తీసుకొని ఒక లక్ష్యంతో చదవాలన్నారు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా దశల వారీగా విద్యా వ్యవస్థలో భారీగా మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది నుంచి పాఠశాలలో ఇంగ్లిష్‌లో బోధన ప్రారంభించి ఆ మేరకు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా పూర్తి చేస్తామన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి, జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *