mt_logo

గుంట పొలం కూడా ఎండనివ్వం: మంత్రి పోచారం

రూ.11.24 కోట్లతో కోటగిరి మండలం కొడిచెర్ల గ్రామం వద్ద మంజీర నదిపై నిర్మించనున్న నూతన ఎత్తిపోతల పథకానికి, కోటగిరి మండల కేంద్రంలో రూ. 15.5 కోట్లతో నిర్మించనున్న 132/33KV సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలలో మంత్రి పొచారం మాట్లాడుతూ కొడిచెర్ల ఎత్తిపోతల పథకం ద్వారా 563 మంది రైతులకు చెందిన 1130 ఎకరాల ఆయకట్టులోని పొలాలకు ఏటా రెండు పంటలకు సాగు నీరందుతుందన్నారు. అయిదు నెలలోనే ఈ పథకం నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం. అదేవిధంగా మంజీర నదిలో నీటి నిల్వకు, పరిసర ప్రాంతాలలో భూగర్భజలాలు మరింతగా పెరగటానికి రూ. 135 కోట్లతో నాలుగు చెక్ డ్యాం లను నిర్మించబోతున్నాం. బాన్సువాడ, బీర్కూర్, కొడిచెర్ల, సుంకిని వద్ద మంజీర నదిలో చెక్ డ్యాంలను నిర్మిస్తాం. నిజాంసాగర్ ఆయకట్టులోని 1.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందిచ్చి కాపాడుతాం అని అన్నారు.

బోర్లు, చెరువులు‌, వాగుల ద్వారా ఈ వానాకాలం నిజాంసాగర్ ఆయకట్టులో సాగుచేసిన వరి పంట విలువ రూ.1000 కోట్లు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు లోని నీళ్ళు రెండు తడులకు సరిపోతాయి. అవసరమైతే మరో తడికి సింగూర్ నుండి నీళ్ళు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గారు వదులుతామని హామీ ఇచ్చారు. కొడిచెర్ల సభ జరుగుతుండగా ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారు ఫోన్ చేసి సింగూర్ నుండి 1.5 TMC ల నీటి విడుదలకు హామీ ఇచ్చారు. “ప్రభుత్వం తరుపున రైతులకు దైర్యంగా చెప్పండి, అవసరమైనంత మేర నీరును వదులుతాం” అని ముఖ్యమంత్రి గారు హామి ఇచ్చారు. రైతులు దైర్యంగా ఉండండి, గుంట పొలం కూడా ఎండనివ్వం అని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారని మంత్రి పోచారం తెలిపారు.

వచ్చే ఏడాది నుండి ఈ సాగునీటి కష్టాలు ఇక ఉండవు, వచ్చే జూన్ నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను నిజాంసాగర్ ప్రాజెక్టు లోకి తరలించి ఏటా రెండు పంటలకు పుష్కలంగా నీరందిస్తాంమని మంత్రి అన్నారు.

అదేవిధంగా పండిన ధాన్యం ను సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తామని. అక్టోబర్ 1 నుండి కొనుగోలు కేంద్రాలు మొదలవుతాయని. రైతులు తొందరపడి తక్కువ ధరకు ప్రవేటు వ్యాపారులకు అమ్మూకోవద్దని మంత్రి చెప్పారు.

నిజామాబాద్ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నులు, కామారెడ్డి జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం మొత్తం 1.10 కోట్ల ఎకరాలు అయితే ఇందులో 50 లక్షల ఎకరాలు సాగు భూమి 23 లక్షల విద్యుత్తు మోటార్ల క్రింద ఉందని మంత్రి పోచారం తెలిపారు.

రాష్ట్రంలో కరంటుకు కొరత లేదు
వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్తును 24 గంటలు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముఖ్యమంత్రి గారి సాహసం, దైర్యంతో రాష్ట్రంలో కరంటు కష్టాలు తీర్చారు. మరో 70 ఏళ్ళ వరకు కొరతలేకుండా రూ. 93,000 కోట్లతో రాష్ట్రంలో 28,000 మెగావాట్ల ఉత్పత్తి చేయడానికి కేంద్రాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా రైతులకు కరంటు ఇబ్బందులు లేకుండా, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోకుండా నూతనంగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.

బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో విద్యుత్తు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాము. కోటగిరి వద్ద రూ. 15 కోట్లతో 132/33KV సబ్ స్టేషన్, రూ. 65 కోట్లతో బీర్కూర్ మండలం దామరంచ వద్ద 220KV సబ్ స్టేషన్ నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *