ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణకు చెందిన పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్య, గిరిజన జానపద డోలి కళాకారుడు రామచంద్రయ్య, కళాసేవకురాలు పద్మజారెడ్డికి మంత్రి కేటీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. అలాగే దేశానికి కోవిద్ వాక్సిన్ అందించిన భారత్ బయోటెక్ వ్వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్ల, క్రిష్ణ ఎల్ల విశిష్టమైన ‘పద్మభూషణ్’ అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
పద్మగ్రహీతలకు శుభాకాంక్షలు అందించిన పలువురు మంత్రులు :
రాష్ట్ర మహిళ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో పటు పలువురు మంత్రులు పద్మశ్రీ గ్రహీతలైన కిన్నెర మెట్ల మొగులయ్య, రామచంద్రయ్య, పద్మజారెడ్డికి శుభాకాంక్షలు అందించారు.