ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రితో భేటీ కానున్న మంత్రి కేటీఆర్ బృందం

  • November 23, 2021 3:02 pm

ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసం మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రుల బృందం ఢిల్లీకి పయనమైంది. మంగళవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ప్రత్యేక సమావేశమయ్యి.. పౌరసరఫరాలు, యాసంగి ధాన్యం కొనుగోలు, బీసీ సంక్షేమం వంటి తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు జోరందుకోగా.. దేశంలోనే అత్యధిక పంట దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కాగా పూర్తి పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని కేంద్రాన్ని మరొకసారి ఈ సందర్భంగా కోరనున్నారు. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటు అధికారులు పాల్గొననున్నారు.


Connect with us

Videos

MORE