రైళ్లలో సీనియర్ సిటిజన్స్ రాయితీలు కొనసాగించాలి : మంత్రి కేటీఆర్

  • November 23, 2021 1:57 pm

కరోనా పేరుతో రైల్వేశాఖ వృద్దులకు ఇచ్చే రాయితీలను రద్దు చేయగా..దీనిపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ సిటిజన్స్ ను గౌరవించుకోవాలని, వారి రాయితీలను కొనసాగించాలని రైల్వే మంత్రికి సూచించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా సంక్షోభం వల్ల 2020 నుండి వయోవృద్ధులతో సహా పలురకాల వారికిచ్చే రాయితీలు రద్దు చేయగా.. దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ పూర్తీ చార్జీలు చెల్లించి ప్రయాణిస్తున్నారు. దీనిపై ఓ వార్తా సంస్థ చేసిన ట్వీట్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్యాగ్ చేసిన మంత్రి కేటీఆర్.. ‘ఇది చాలా దురదృష్టకరం. కోట్లాది మంది సీనియర్ సిటిజన్స్ అవస్థలు పడటం మంచిది కాదు. వారి సహాయ,సహకారాలు మనకు అవసరం. వారిని ఎల్లవేళలా గౌరవించుకోవాలి. ఎప్పట్లాగే సీనియర్ సిటిజన్స్ రాయితీలను కొనసాగించాలి. ఈ అంశంపై పూర్తిగా సమీక్షించి మంచి నిర్భయం తీసుకొని వారికి సహాయపడాలి’ అని తన ట్విటర్లో పేర్కొన్నారు.


Connect with us

Videos

MORE