ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమ ఎత్తివేత అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సీసీఐ పరిశ్రమ తొలగింపు ఉత్తర్వులను మరోసారి పునః సమీక్షించాలని కేంద్ర మంత్రి పీయూష్గోయల్‌ను కోరారు. సీసీఐ పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల తోడ్పాటు అందిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వందల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను తొలగించవద్దని, సీసీఐ పరిశ్రమ నిలదొక్కుకుని ముందుకు సాగేందుకు ప్రభుత్వం తరపున అసవరమైన ఆర్థికపరమైన ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు.