mt_logo

అపుడు వెక్కిరించిన వాళ్లకు సమాధానం… నేటి గణనీయ అభివృద్ధి : మంత్రి కేటీఆర్

అపుడు తెలంగాణను వెక్కిరించిన వాళ్లే నేడు తెలంగాణ అభివృద్ధిని చూసి మెచ్చుకుంటున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు పేర్కొన్నారు. 2001లో కరీనంగర్ లో జరిగిన సింహగర్జన సభలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని తెరాస పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై రాజకీయ ప్రత్యర్థులు ఎగతాళి చేశారని.. కానీ, నేడు సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శుక్రవారం జనగాం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘మోడీ జాగ్రత్త.. ఢీల్లీ కోట గోడలు బద్ధలు కొడుతాం’ అని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ విధంగా స్పందించారు. ‘మొదట వాళ్లు నిన్ను పట్టించుకోరు. తర్వాత వాళ్లు నిన్ను చూసి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్లు నీతో గొడవ పడుతారు. చివరకు విజయం నీదే’ అన్న జాతీపిత మహాత్మ గాంధీ మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *