mt_logo

జర్నలిస్టుల ఇండ్ల సమస్య క్లియర్ చేసినందుకు సీజేఐకి ధన్యవాదాలు : మంత్రి కేటీఆర్

తెలంగాణ జ‌ర్న‌లిస్టుల నివాసాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించిన భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం చీఫ్ జ‌స్టిస్‌ ఎన్వీ ర‌మ‌ణ బృందానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. దీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును క్లియ‌ర్ చేసినందుకు సీజేఐకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు కేటీఆర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెర‌వేర్చేందుకు ఈ తీర్పు తోడ్ప‌డుతుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా ఇండ్ల స్థ‌లాల కోసం పోరాడుతున్న హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్టుల‌కు సీజేఐ శుభ‌వార్త వినిపించిన సంగ‌తి తెలిసిందే. జ‌ర్న‌లిస్టుల‌కు కేటాయించిన స్థ‌లాల స్వాధీనానికి, నిర్మాణాల‌కు అనుమ‌తిస్తూ సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం గురువారం తీర్పునిచ్చింది. కాగా తెలంగాణ జర్నలిస్టుల నివాసాల కోసం సుప్రీంకోర్టులో ఈ కేసు త్వరగా పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం తరఫున వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు మరియు మంత్రి కేటీఆర్ కు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీసాగర్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *