కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. డాలర్‌తో రూపాయి మారకంవిలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, గాఢ నిద్రలో ఉందని విమర్శించారు. ఒకవైపు రూపాయి విలువ అత్యంత కనిష్ఠానికి పడిపోతుంటే.. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి రేషన్ దుకాణాల్లో ప్రధాని మోదీ ఫొటో వెతుకుతూ బిజీగా ఉన్నారన్నారు. అదీకాకుండా రూపాయి విలువ సాధారణంగానే పడిపోయిందని చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని ఆర్థిక అవరోధాలకు, నిరుద్యోగం, ద్రవోల్బణానికి గాడ్ ఆఫ్ యాక్ట్సే కారణమంటారని ఎద్దేవా చేశారు. దేశంలో ఇంత జరుగుతున్నా విశ్వగురును పొగుడుతూ ఉండాలని కేటీఆర్ వ్యంగాస్త్రం విసిరారు.